పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలు చివరి దశ షూటింగ్‌కు చేరుకున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను కూడా మేకర్స్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలో ప్రభాస్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అయితే, ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో భాగంగా సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రంలో ప్రభాస్ లుక్స్‌ను తీర్చిదిద్దేందుకు ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్‌ను సంప్రదించారు. ఈయన సందీప్ రెడ్డి వంగా గత చిత్రాల హీరోలకు కూడా లుక్స్ డిజైన్ చేశారు.
దీంతో ఈసారి ప్రభాస్‌ను ఎలాంటి లుక్స్‌తో చూపెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి షూటింగ్ చేసేందుకు సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు.