నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్న టాలీవుడ్.. నాని సినిమాకి కూడా ఊహించని ప్లానింగ్!?

నెక్స్ట్ లెవెల్ కి వెళుతున్న టాలీవుడ్.. నాని సినిమాకి కూడా ఊహించని ప్లానింగ్!?

Published on Aug 31, 2025 3:00 AM IST

paradise

ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా లెవెల్ ఎలా పెరుగుతూ వెళుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన హీరోలు, దర్శకులు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ తెలుగు సినిమాని ఖండాంతరాలు దాటించే యత్నం చేస్తున్నారు. మరి రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ సినిమా కూడా హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కన్నెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో కలిసిన సంగతి తెలిసిందే.

మరి ఇదే సంస్థతో నాచురల్ స్టార్ నాని నెక్స్ట్ భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ కూడా కలిసినట్టు తెలుస్తుంది. దీనితో వరల్డ్ వైడ్ గా మార్కెటింగ్ పరంగా ఈ రెండు సినిమాలు కొత్త చాప్టర్ ని స్టార్ట్ చేసేలా ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికి అయితే ది ప్యారడైజ్ మేకర్స్ చర్చలు సాగిస్తున్నారట. ది ప్యారడైజ్ ని పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్, స్పానిష్ లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. సో వీరు కూడా ఈ ప్లాన్ కోసం రెడీ అయినట్టు ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు