స్టార్ హీరో గ్యాంగ్ స్టర్ డ్రామా మొదలయ్యేది మార్చిలోనే

స్టార్ హీరో గ్యాంగ్ స్టర్ డ్రామా మొదలయ్యేది మార్చిలోనే

Published on Feb 12, 2021 10:14 PM IST


విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మూడు విభిన్న చిత్రాలే. ఒక్కొక్క సినిమా ఒక్కో జానర్. అజయ్ ఙ్ఞానముత్తు డైరెక్షన్లో చేస్తున్న ‘కోబ్రా’లో విక్రమ్ 35 భిన్న వేషధారణల్లో కనిపించనుండగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఒక పిరియాడికల్ డ్రామా. ఇందులో కూడ విక్రమ్ ఒక భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆయన చేస్తున్న మరొక చిత్రాన్ని ‘పిజ్జా, పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బారాజు డైరెక్ట్ చేస్తున్నారు.

ఇందులో విక్రమ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయనతో పాత్రు ఆయన కుమారుడు, హీరో ధృవ్ విక్రమ్ సైతం ఒక కీ రోల్ చేయనున్నారు. ఇదివరకే సినిమా మొదలవ్వాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైంది. కార్తీక్ సుబ్బరాజ్ ధనుష్ హీరోగా చేసున్న ‘జగమే తంతిరం’ కూడ ముగింపు దశ పనుల్లో ఉంది. దీంతో మార్చి నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూట్ మొదలవుతుందని సమాచారం. విక్రమ్, ధృవ్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు