అల్లరోడి ఆడియో విడుదలకి చిరంజీవి చీఫ్ గెస్ట్

అల్లరోడి ఆడియో విడుదలకి చిరంజీవి చీఫ్ గెస్ట్

Published on Oct 17, 2012 8:23 AM IST


ఇటీవలే సడన్ స్టార్ ‘సుడిగాడు’గా భారీ హిట్ కొట్టిన అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిదిగా రాబోతున్నాడు. 1988లో వచ్చిన చిరంజీవి సూపర్ హిట్ సినిమా యముడికి మొగుడు టైటిల్ ని అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమాకి ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమానికి రావాలని అడగగానే అయన అంగీకరించారని నిర్మాత చంటి అడ్డాల అన్నారు. ఈ సినిమాకి కథ డిమాండ్ చేయడంతో ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందని అయన చెబుతున్నారు. ఇటీవలే చిరంజీవి గారి పుట్టిన రోజు సందర్బంగా ఈ చిత్ర లోగోని ఆవిష్కరించారు. ఈ. సత్తిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాటను న్యూజిలాండ్లో చిత్రీకరించనున్నారు. షాయాజీ షిండే యముడిగా నటిస్తున్న ఈ సినిమాలో రిచా పనాయ్ హీరొయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి రమ్యకృష్ణ నరేష్ అత్తగా కనిపించబోతుంది.

తాజా వార్తలు