ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో తన 152వ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే సగానికి షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ రేపు చిరు పుట్టినరోజు కానుకగా రానుంది. టైటిల్ ఏంటో ఇప్పటికే అందరికీ తెలిసిందే.
కానీ ఇంకా దానిని ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేస్తామని కూడా ఎక్కడా చెప్పలేదు కానీ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ తాలూకా టీజర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే చిరు పుట్టినరోజు కోసం మాత్రం కొరటాల ముందు మరో అదిరిపోయే టీజర్ ను కట్ చేశారట.
కానీ చిరు మాత్రం దానిని తన పుట్టినరోజు కానుకగా విడుదల చెయ్యొద్దని కోరారని తెలుస్తుంది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతున్నప్పుడు ఒక్కొక్కటిగా విడుదల చేద్దామని సూచించారట. అందుకే కొరటాల మరో వెర్షన్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది.