మెగా అల్లుడి రెండవ చిత్రం ఖరారు

మెగా అల్లుడి రెండవ చిత్రం ఖరారు

Published on Oct 24, 2012 9:30 PM IST


మెగాస్టార్ చిరంజీవికి అల్లుడు అయిన సాయి ధరం తేజ్, గీత ఆర్ట్స్ నిర్మించబోతున్న చిత్రంలో కనిపించబోనున్నారు చిరంజీవి తెర నుండి నిష్క్రమించిన తరువాత ఆయన వంశం నుండి వచ్చిన మరో నటుడు సాయి ధరం తేజ. గతంలో “యజ్ఞం” వంటి హిట్ చిత్రాన్ని అందించిన ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.దిల్ రాజు ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు ఈ చిత్రం వచ్చే నెల మొదలు కానుంది. 2013 మొదట్లో విడుదల చెయ్యాలని యోచిస్తున్నారు. నిర్మాతలు ఈ చిత్రం గురించి చెప్తూ ” ఈ చిత్రంలో కావలసినంత వినోదాత్మక అంశాలు ఉంటాయి శ్రీహరి ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు” అని చెప్పారు. సాయి ధరం తేజకి ఇది రెండవ చిత్రం కానుంది ప్రస్తుతం వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో “రేయ్” చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు