మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. చాలా కాలం తర్వాత చిరు నుంచి వస్తున్న ఫాంటసీ సినిమా కావడంతో మంచి అంచనాలు దీనిపై ఉన్నాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ పై దర్శకుడు కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
గత ఏడాది దసరా కానుకగా వచ్చిన టీజర్ గ్లింప్స్ పై పలు ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి వచ్చే ట్రైలర్ మాత్రం అందరికీ సమాధానం ఇస్తుంది అని యువ దర్శకుడు చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. అప్పుడు ట్రోల్ చేసినవారు అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ట్రైలర్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.
దీనితో ఈసారి అవుట్ పుట్ మాత్రం ఎలాంటి ట్రోల్స్ కి తావివ్వని విధంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.