కష్టాల్లో ఉన్న మెగా అభిమానికి చిరు సహాయం

కష్టాల్లో ఉన్న మెగా అభిమానికి చిరు సహాయం

Published on Feb 19, 2021 1:35 AM IST


మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులను ఎంతలా ప్రేమిస్తారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన సేవా ధృక్పథాన్ని భుజాలకెత్తుకున్న ఫ్యాన్స్ అంటే ఆయనకు ఎనలేని గౌరవం ఉంది. అందుకే వారికి కష్టాలు ఎదురైతే చేయి అందిస్తుంటారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో బాధపడుతున్న అనేక మంది అభిమానులకు చేయూతనిచ్చిన చిరు తాజాగా కూడ ఒక వీరాభిమానికి తనవంతు సహాయం చేశారు.

కడపకు చెందిన సీనియర్ మెగాభిమాని పి సురేష్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అఖిల భారత చిరంజీవి యువతకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న ఆయన కడప జిల్లా అఖిల భారత చిరంజీవి యువతకు అధ్యక్షుడిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సొంత ఖర్చులతో చిరు పేరు మీద అనేక మంచి పనులు చేశారు ఆయన. చిరుతో ఆయనకు నేరుగా అనుబంధం ఉంది. అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు. చికిత్స కోసం ఇప్పటికే చాలా మొత్తం ఖర్చు చేసిన ఆయన కష్టం తెలుసుకున్న చిరు వెంటనే లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని పంపారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు