ఎన్టీఆర్ ఛాలెంజ్ కి మెగాస్టార్ ‘ఛాలెంజ్’ !

ఎన్టీఆర్ ఛాలెంజ్ కి మెగాస్టార్ ‘ఛాలెంజ్’ !

Published on Apr 21, 2020 3:47 PM IST

‘ఇంట్లో ప్రేమలు ఆప్యాయతలే కాదు. పనులను కూడా పంచుకుందాం’ అంటూ ఎన్టీఆర్ ‘బీ ద రియల్‌ మెన్‌’ ఛాలెంజ్ ను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్యలతో పాటు కొరటాల శివకి కూడా ఛాలెంజ్ విసిరారు. కాగా మెగాస్టార్ తాజాగా ఎన్టీఆర్ ఛాలెంజ్ ను అంగీకరించినట్లు తన ‘ఛాలెంజ్’ సినిమా టైటిల్ వీడియోను పోస్ట్ చేసి వినూత్నంగా తారక్ ఛాలెంజ్ ను స్వీకరించారు.

మొత్తానికి కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇంటికే పరిమితమైపోవడంతో ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో సినీ ప్రముఖులంతా తమలోని ఫ్యామిలీ మెంబర్ కోణాన్ని ప్రదర్శిస్తూ.. ఇంటి పని, వంట పని చేస్తూ తమ తోటి స్టార్స్ చేత కూడా చేయించడం ఫ్యాన్స్ కు బాగా ఆసక్తిని కలిగిస్తోంది.

దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ‘బీ ద రియల్‌ మెన్‌’ పేరుతో మొదలెట్టిన ఈ ఛాలెంజ్.. రాజమౌళి పుణ్యమా అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం.. వారి రంగప్రవేశంతో ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ పక్రియ రణ్ వీర్ సింగ్ రూపంలో బాలీవుడ్ దాకా చేరింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు