అభిమాని కుటుంబానికి చరణ్ ఆర్ధిక సాయం

మెగా హీరో రామ్ చరణ్ మరో మారు తన పెద్ద మనసు చాటుకున్నారు. తన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం చేసి వాళ్లకు అండగా నిలిచాడు. హైదరాబాద్ సిటీ పరిధిలో మెగా ఫ్యామిలీకి చిరకాల అభిమాని, మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు నూర్ అహ్మద్ కొద్దిరోజుల క్రితం అకాల మరణం పొందారు. దీనితో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన మెగా హీరోలు వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చడం జరిగింది. కాగా రాంచరణ్ ఆ సమయంలోనే ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇక నేడు రామ్ చరణ్…నూర్ అహ్మద్ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని వారికి 10లక్షల ఆర్థిక సాయం చేశారు. దానికి సంబంధించిన చెక్స్ వారికి అందజేశారు.

చరణ్ చేసిన ఈ సాయానికి నూర్ ఫ్యామిలీ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయన ఔదార్యానికి వారు కృతజ్ఞలు తెలిపారు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. మరో హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్నారు.

Exit mobile version