మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఎవడు’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన సమంతా మరియు ఏమీ జాక్సన్ నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్, ఏమీ జాక్సన్ లపై షూటింగ్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అబ్బూరి రవి సంభాషణలు అందిస్తున్నారు. రామ్ చరణ్ ఇటీవలే ‘జంజీర్’ మొదటి షెడ్యుల్లో పాల్గొన్నాడు.