మార్పే నా విజయానికి కారణమంటున్న గోవా బ్యూటీ

మార్పే నా విజయానికి కారణమంటున్న గోవా బ్యూటీ

Published on Oct 22, 2012 4:52 PM IST


చాలా మంది తమ జీవితంలో వచ్చే మార్పులను ఇష్టపడరు. ఎప్పుడూ ఒకేలా ఉండాలనుకుంటారు కానీ గోవా బ్యూటీ ఇలియానా మాత్రం మార్పే మన జీవితాన్ని మార్చేస్తుంది అంటున్నారు అదేంటో ఆమె మాటల్లోనే విందాం ‘ అనుకోని మార్పే నా విజయానికి కారణం. పరిస్థితులను బట్టి నన్ను నేను మార్చుకున్నాను. నేను స్కూల్ చదువుకునే రోజుల్లో నాకు చాలా సిగ్గు కానీ అది నాకు నేనుగా మార్చుకొని మోడలింగ్ రంగంలో అడుగుపెట్టాను. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం వచ్చింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదట్లో అన్నీ గ్లామర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్రలే వచ్చాయి కానీ బాలీవుడ్లో వచ్చిన మొదటి అవకాశం ‘బర్ఫీ’ లో నటించడానికి ఆస్కారమున్న పాత్ర దక్కింది. సమయానికి తగ్గట్టు నన్ను నేను మార్చుకుంటూ వెళుతున్నా కాబట్టే నాకు విజయం వస్తోందని’ ఆమె అన్నారు.

ఈ సంవత్సరం ఇలియానా నటించిన ‘జులాయి’ సినిమా హిట్ అయిన తర్వాత తెలుగులో తనకి పెద్దగా ఆఫర్లు రాలేదు మరియు ఇలియానా కూడా బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇలియానా జీవితంలో ఎలాంటి మార్పులు జరిగి మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ లోకి వస్తుందో చూడాలి.

తాజా వార్తలు