మరో విభిన్నమయిన చిత్రంతో రానున్న చంద్రశేఖర్ ఏలేటి

మరో విభిన్నమయిన చిత్రంతో రానున్న చంద్రశేఖర్ ఏలేటి

Published on Dec 28, 2012 12:00 PM IST

yeleti-chandrasekhar
తన చిత్రాలతో పలు ప్రయోగాలు చేసి మంచి పేరు తెచ్చుకున్న దర్శకులలో చంద్రశేఖర్ ఏలేటి ఒకరు. “ఐతే” చిత్రంతో పరిచయం అయిన ఈ దర్శకుడు “అనుకోకుండా ఒక రోజు”,”ప్రయాణం” మరియు “ఒక్కడున్నాడు” వంటి విభిన్న చిత్రలతో పరిశ్రమలొమంచి పేరు సంపాదించుకున్నాడు. కాస్త విరామం తరువాత ఈ దర్శకుడు గోపీచంద్ మరియు తాప్సీలు ప్రధాన పాత్రలలో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఒక సాదారణ వ్యక్తి నిధి అన్వేషణకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్ర క్లైమాక్స్ అద్భుతంగా ఉండబోతుందని తాజా సమాచారం.

ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో క్లైమాక్స్ అద్భుతమయిన విజువల్ ఎఫెక్ట్స్ కలిగి ఉండబోతుంది. ఈ చిత్రం గతంలో లడక్ లో చిత్రీకరణ జరుపుకుంది. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శంధత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

తాజా వార్తలు