మన టాలీవుడ్ లో ఉన్న మంచి టాలెంటెడ్ హీరోలలో అక్కినేని వారసుడు నవ యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా ఒకడు. ఎలాంటి రోల్ ను అయినా సరే ఈజ్ గా పర్ఫెక్ట్ గా చెయ్యగలిగే చైతు ఇప్పుడు వారి ఆస్థాన దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో “థ్యాంక్ యూ” అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా దీనిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.
అయితే మరి తారక్ చెయ్యబోయే మరో సినిమాకు సంబంధించి సినీ వర్గాల్లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. చైతుతో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఓ ఇంట్రెస్టింగ్ సినిమాను తెరకెక్కించనున్నాడని తెలుస్తుంది. అది కూడా ఒక పోలీస్ డ్రామా అన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదా అన్నది తెలియాలి అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఫైనల్ గా ఈ కాంబో సెట్టైతే మరో ఫ్రెష్ సినిమా రావడం గ్యారంటీ అని చెప్పాలి.