స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుగుతోంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమలా పాల్, కేథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర పరంగా చాలా అందంగా, గ్లామరస్ కనిపిస్తుంది అని ప్రొడక్షన్ టీం తెలిపారు. అలాగే ఫ్యాన్స్ కి ఆమె గ్లామరస్ల్ లుక్ విజువల్ ట్రీట్ అని అంటున్నారు.
అల్లు అర్జున్ ని ఇష్టపడి ప్రేమించే పాత్రలో కేథరిన్ కనిపించనుంది, అలాగే అమలా పాల్ తో పోటిపడి నటిస్తోంది. కేథరిన్ చేసిన ‘చమ్మక్ చల్లో’ సినిమా అంతగా ఆడకపోయినా ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని అత్యాదునిక టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కిస్తున్నారు. అమోల్ రాథోడ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి బండ్ల గణేష్ ప్రొడ్యూసర్. ఈ సినిమాని మేలో విడుదల కానుంది.