“బిగ్ బాస్ 4″లో సుమ వార్ వన్ సైడ్ చేసేస్తారా?


మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పుడు నాలుగో సీజన్లో కూడా అదే స్థాయి ఆదరణతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవలే బిగ్ బాస్ ఓ ఎపిసోడ్ కు గాను సమంతా హోస్టింగ్ చెయ్యడంతో మరోసారి ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఊహించని విధంగా తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ యాంకర్ సుమ కనకాల బిగ్ బాస్ హౌస్ లోకి ఒక కంటెస్టెంట్ గా అడుగు పెట్టేందుకు రెడీ అయ్యినట్టు మేకర్స్ కన్ఫామ్ చేసేసారు. అయితే ఇక అంతా సుమ గేమింగ్ కోసమే ఆలోచనలో పడ్డారు.

ఒకవేళ సుమ కనుక షో లో భాగం అయితే ఖచ్చితంగా వార్ వన్ సైడ్ చెయ్యగలిగే సామర్ధ్యం కలవారని షో ఫాలోవర్స్ మరియు నెటిజన్స్ అంటున్నారు.అయితే వారు ఎందుకు అనుకుంటున్నారో కొన్ని కారణాలు కూడా లేకపోలేవు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అందరితో పోలిస్తే సుమ మనుషుల్ని చదవడంలో ఎంతో అనుభవశాలి.

ఇదొక్కటేనా ఎంటెర్టైన్మెంట్ కు ఆమె కేరాఫ్ అడ్రెస్ వీటితో పాటు సందర్భానుసారం నడుచుకోవడం కూడా సుమకు వెన్నతో పెట్టిన విద్య. అయితే సుమ నిజంగానే ఒక కంటెస్టెంట్ లా అడుగు పెడతారా లేక జస్ట్ అలా ప్లాన్ చేశారా అన్నది చూడాలి.

Exit mobile version