స్టైలిష్ పోలీస్ డ్రామాతో రానా – బి.వి.ఎస్ రవి మూవీ?

స్టైలిష్ పోలీస్ డ్రామాతో రానా – బి.వి.ఎస్ రవి మూవీ?

Published on Feb 25, 2013 2:30 PM IST

Rana-BVS-Ravi

అందరికీ తెలిసిన స్క్రిప్ట్ రైటర్ బి.వి.ఎస్ రవి రానా దగ్గుబాటి కోసం ఓ స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా స్టైలిష్ పోలీస్ డ్రామా అని అంచనా వేస్తున్నారు. ఫిల్మ్ నగర తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది, త్వరలోనే దీనిమీద అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ‘ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని’ సమాచారం.

తెలుగులో హిట్ అయిన ‘దేనికైనా రెడీ’, ‘కింగ్’, ‘సత్యం’ లాంటి సినిమాలకు బి.వి.ఎస్ రవి కథాసహకారం – డైలాగ్స్ అందిచాడు. అలాగే గోపీచంద్ హీరోగా నటించిన ‘వాంటెడ్’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. రానాతో తన డైరెక్టర్ గా తన రెండవ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ‘డిపార్ట్ మెంట్’ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మంచి పెర్ఫార్మన్స్ చేసిన రానా డైరెక్ట్ తెలుగులో పోలీస్ ఆఫీసర్ గా చేయనున్న ఈ సినిమా అతని కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుంది. అధికారిక ప్రకటన రాగానే పూర్తి వివరాలను మీకందిస్తాము.

తాజా వార్తలు