‘కింగ్డమ్’ ట్రైలర్‌తో విజయ్ ర్యాంప్ ఆడిస్తాడా..?

‘కింగ్డమ్’ ట్రైలర్‌తో విజయ్ ర్యాంప్ ఆడిస్తాడా..?

Published on Jul 21, 2025 2:00 PM IST

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు.

అయితే, కింగ్డమ్ ట్రైలర్‌పై సినీ సర్కిల్స్‌లో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్ర ట్రైలర్ కట్ ఇప్పటికే రెడీ అయిందని.. ఇది పూర్తిగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని ఇన్‌సైడ్ టాక్. ఇక ఈ ట్రైలర్‌ను జూలై 25న రిలీజ్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. కాగా ఈ ట్రైలర్‌లో అదిరిపోయే విజువల్స్, విజయ్ చేసే యాక్షన్, భాగ్యశ్రీ గ్లామర్.. ఇలా అన్ని అంశాలు ఉండేలా మేకర్స్ ఈ ట్రైలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

మరి నిజంగానే ‘కింగ్డమ్’ చిత్ర ట్రైలర్‌తో విజయ్ దేవరకొండ సినిమాపై హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్తాడా.. అనేది చూడాలి. భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కు మేకర్స్ రెడీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు