యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరీర్‌లోని 22వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని రామ్ భావిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్టును ఓకే చేసే పనిలో ఉన్నాడట. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ చెప్పిన కథలు వింటున్నాడట ఈ హీరో. అయితే, దర్శకుడు చందూ మొండేటి రామ్ కోసం ఓ కథను రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా ‘తండేల్’ వంటి బ్లాక్‌బస్టర్‌తో సత్తా చాటిన చందూ తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ హీరో సూర్యతో చేయాల్సి ఉంది.
కానీ, కొన్ని కారణాల వల్ల అది ఆలస్యం అవుతుండటంతో ఇప్పుడు రామ్ పోతినేని తో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడట ఈ డైరెక్టర్. ఇక ఇప్పటికే రామ్‌ను పలుమార్లు కలిసిన చందూ, కథను వినిపించాడని.. దీనికి రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాల్సి ఉంది.