సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కింగ్ నాగార్జున, రియల్ స్టార్ ఉపేంద్ర అలాగే అమీర్ ఖాన్, సౌబిన్ సాహిర్ కలయికలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన భారీ చిత్రమే “కూలీ”. ఎన్నో అంచనాలు నడుమ వచ్చి డివైడ్ టాక్ అందుకున్నప్పటికీ 500 కోట్ల మేర వసూళ్లు ఈ సినిమా అందుకుంది. ఇలా గత నెల 14న థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు డేట్ ఫిక్స్ చేసేసుకుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి లేటెస్ట్ గా వారు ఈ సెప్టెంబర్ 11 నుంచి కూలీ స్ట్రీమింగ్ కి వస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. తమిళ్, తెలుగు సహా కన్నడ, మలయాళ భాషల్లో ఆరోజు నుంచి సినిమా స్ట్రీమింగ్ కి రానుందట. హిందీ వెర్షన్ అయితే తర్వాత రానుంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.