‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?

‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా..?

Published on Oct 22, 2025 1:30 AM IST

దీపావళి బరిలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు సందడి చేస్తు్న్నాయి. వాటిలో ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యూత్‌ను ఈ మూవీ కట్టిపడేస్తుంది. ఇక ఈ సినిమాను దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు కురుస్తున్నాయి.

అయితే, బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో రన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై సినీ సర్కిల్స్‌లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. డ్యూడ్ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు దక్కించుకుంది. దీంతో ఈ సినిమాను నవంబర్ 14న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగానే నవంబర్ 14న డ్యూడ్ ఓటీటీ ఎంట్రీ ఇస్తాడా అనేది వేచి చూడాలి.

తాజా వార్తలు