మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటెసీ చిత్రం ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి అప్డేట్ వచ్చినా అభిమానులు కచ్చితంగా ఫాలో అవుతున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్స్‌ను చిరంజీవి వీక్షించినట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల గ్రాఫిక్స్ వర్క్‌ను ఆయన చూశారట. ఇక ఈసారి ఔట్పుట్ విషయంలో ఆయన సంతోషం వ్యక్తం చేశారట. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మిగతా ప్యాచ్ వర్క్, సాంగ్ షూట్‌ను కూడా వీలైనంత త్వరగా ముగించాలని ఆయన చిత్ర యూనిట్‌కు సూచించారట.
ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.