‘మహాభారతం’లో అల్లు అర్జున్ కి పవర్ఫుల్ రోల్?

‘మహాభారతం’లో అల్లు అర్జున్ కి పవర్ఫుల్ రోల్?

Published on May 14, 2025 1:05 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మార్కెట్ ఇపుడు పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్లో కొత్త లెక్కలు చూపించిన బన్నీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాతో రచ్చ చేయబోతున్నాడు. ఇక తన లైనప్ లో పలు సాలిడ్ ప్రాజెక్ట్ లు ఆల్రెడీ లైన్ లో ఉండగా ఇపుడు మహాభారతం కూడా వచ్చినట్టుగా కొన్ని రూమర్స్ వైరల్ గా మారాయి.

అయితే ఇది మన టాలీవుడ్ నుంచి ఎస్ ఎస్ రాజమౌళి మహాభారతం కాదట బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం కోసం అన్నట్టు బజ్ వినిపిస్తుంది. అయితే లేటెస్ట్ రూమర్స్ ప్రకారం ఇందులో అల్లు అర్జున్ పవర్ఫుల్ రోల్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. దీని ప్రకారం, బన్నీ తన పేరు అర్జునుడి పాత్రనే ఈ మహా భారతంలో పోషించనున్నాడు అని ఇపుడు తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ ఉందో కానీ ఉంటే మాత్రం తన నుంచి మరో గుర్తుండిపోయే పాత్రగా అది నిలిచిపోవచ్చని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు