‘లక్కీ భాస్కర్’ కోసం బుట్టబొమ్మ రెడీ!?

టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటుగా తన హవా చూపించిన స్టార్ హీరోయిన్స్ లో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఒకరు. మరి పూజా హెగ్డే హీరోయిన్ గా తెలుగులో మంచి సక్సెస్ లు కొట్టిన తర్వాత పూజా హెగ్డేకి వరుసగా ప్లాప్ లు పడ్డాక మాత్రం తన ప్రెజెన్స్ తెలుగు సినిమా దగ్గర తగ్గిపోయింది. ఇలా కొన్నాళ్ల పాటు పూజా హెగ్డే ప్రెజెన్స్ మిస్ అయ్యాక మళ్ళీ తమిళ్ వరుస అవకాశాలు పూజాని వరించాయి.

రీసెంట్ గానే మరో క్రేజీ ఆఫర్ కూడా అందుకుంది అని కూడా వినిపించిన వార్తలు తర్వాత మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు బయటకి వచ్చింది. దీనితో పూజా హెగ్డే ఇపుడు లక్కీ భాస్కర్ సల్మాన్ సరసన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక కొత్త దర్శకుడు టేకాఫ్ చేయనున్న ఈ ప్రాజెక్ట్ లో వీరిద్దరూ నటిస్తారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. ఇక మరోపక్క పూజా హెగ్డే పై కూలీ నుంచి స్పెషల్ సాంగ్ రేపు రానున్న సంగతి తెలిసిందే.

Exit mobile version