ప్రిన్స్ మహేష్ బాబు తన ‘బిజినెస్ మేన్’ చిత్రంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల తుఫాను సృష్టిస్తున్నారు. చిత్ర నిర్మాతలు ఈ చిత్రానికి సంబందించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విడుదల చేసారు. మొదటి రోజులకు గాను దాదాపుగా 27.35 కోట్ల రూపాయలు షేర్ దక్కించుకోగా 38.16 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది.
బిజినెస్ మేన్ రికార్డు స్థాయిలో ఈ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అన్ని ఏరియాల్లో కలెక్షన్స్ బలంగా ఉండటంతో నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. బిజినెస్ మేన్ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేయగా ఆర్ఆర్ వెంకట్ నిర్మించారు.