ప్రిన్స్ మహేష్ బాబు నటించిన “బిజినెస్ మాన్ ” చిత్రం జనవరి 11 న విడుదల కానుండగా ఈ చిత్రానికి వస్తున్నన రెస్పాన్స్ అద్బుతం తాజా సమాచారం ప్రకారం “బిజినెస్ మాన్ ” చిత్రం లో పాటలను కాలర్ ట్యూన్ గా ఇప్పటికే చాలా మంది పెట్టుకున్నారు. ఈ కాలర్ ట్యూన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చాలా బాగుంది.
“సార్ వస్తార” అనే పాట ఈ చిత్రం లో బాగా ప్రాచుర్యం పొందిన పాటగా నిలిచింది. ఈ పాటను ఇప్పటికే ఒక లక్ష మందికి పైగా కాలర్ ట్యూన్ గా పెట్టుకున్నారు. ఇది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి మరింత లాభం చేకుర్చనుంది. బిజినెస్ మాన్ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా కాజల్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం “పోకిరి” మేజిక్ ను మళ్ళి చేస్తుంది అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.