రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం

రేపు మొదలుకానున్న పూరి-బన్నిల చిత్రం

Published on Oct 16, 2012 10:42 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అమలా పాల్ మరియు రిచా గంగోపాధ్యాయ్ ప్రధాన పాత్రలలో రాబోతున్న “ఇద్దరు అమ్మాయిలతో” చిత్రం రేపు రామానాయుడు స్టూడియోస్లో చిత్రీకరణ లాంచనంగా మొదలుపెట్టుకోనుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ స్పెయిన్లో జరుపుకోనుంది కోట శ్రీనివాస రావు మరియు అలీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ మధ్యనే బండ్ల గణేష్ ఖరీదయిన వజ్రపు లైటర్ ని పూరికి బహుమతిగా ఇచ్చారు. “జులాయి” చిత్ర విజయం తరువాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి.

తాజా వార్తలు