స్పెయిన్ వెళ్లనున్న బన్ని


ఇటీవలే విడుదలైన ‘జులాయి’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాదించడం అలాగే ఈ చిత్ర ప్రమోషన్ కార్యకరమాలు కూడా పూర్తవడంతో బన్ని హాలిడే ట్రిప్ ప్లాన్ చేసారు. బన్ని తన భార్యతో కలిసి స్పెయిన్ వెళ్లనున్నారు.

ఒక వారం రోజులు స్పెయిన్ లో గడిపిన తర్వాత తన కొత్త మూవీ లాంచ్ టైంకి బన్ని హైదరాబాద్ కి తిరిగి వస్తారు. బన్ని నటించబోయే కొత్త సినిమాకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ఇద్దరమ్మాయిలతో’ అనేది టైటిల్.

ఈ స్పెయిన్ హాలిడే ట్రిప్ లో బన్ని బాగా ఎంజాయ్ చెయ్యాలని మరియు చాలా మధురానుభూతులను పొందాలని కోరుకుందాం.

Exit mobile version