సంతానం పాత్రలో మెరవనున్న బ్రహ్మానందం

సంతానం పాత్రలో మెరవనున్న బ్రహ్మానందం

Published on Feb 26, 2013 4:51 PM IST

brahmanandam

సిద్దార్థ్, హన్సిక హీరో హీరోయిన్లు గా తమిళ సినిమా ‘ తీయ వేల సేయనుం కుమరు’ అనే ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు. సుందర్. సి దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాకి ఖుష్బూ ప్రొడ్యూసర్. ఈ సినిమాలో తమిళ కమెడియన్ సంతానం ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా నిర్మిస్తున్నారు. తెలుగు వెర్షన్లో సంతానం పాత్రని కామెడీ స్టార్ బ్రహ్మనందం పోషిస్తున్నాడు. సిద్దార్థ్, హన్సిక తెలుగులో చాలా సినిమాలలో నటించారు. అలాగే బ్రహ్మానందం నటిస్తుండడంతో ఈ సినిమాకు క్రేజ్ పెరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు.

తాజా వార్తలు