ఇండియాలో బ్రాడ్ పిట్ ‘ఎఫ్ 1’ కి సాలిడ్ వసూళ్లు!

రీసెంట్ గా హాలీవుడ్ సినిమా నుంచి రిలీజ్ కి వచ్చి మొదటి రోజు నుంచే సాలిడ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది హాలీవుడ్ స్టార్ నటుడు బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ 1 అనే చెప్పాలి. తాను మంచి హిట్ కొట్టాలని చూస్తున్న ఫ్యాన్స్ కి ఎఫ్ 1 తో బ్రాడ్ పిట్ సమాధానం అందించారు.

అయితే ఈ చిత్రానికి అనూహ్యంగా మన దేశంలో కూడా సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. తెలుగు, హిందీ, తమిళ్ సహా ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ సినిమాకి మంచి వసూళ్లు నమోదు అయ్యినట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. గత జూన్ 27న రిలీజ్ అయ్యిన ఈ సినిమా ఈ 9 రోజుల్లో 43 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది.

నోటెడ్ బ్రాండ్స్ మార్వెల్, డీసీ లాంటి సినిమాలు అందుకునే క్రేజ్ లాంటిది లేకుండానే మంచి టాక్ తోనే ఈ సినిమా రాణించడం విశేషం. ఇక ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ తో యంగ్ నటుడు డామ్సన్ ఐడ్రిస్ కూడా నటించగా జోసెఫ్ కోసిన్స్కి దర్శకత్వం వహించారు.

Exit mobile version