యూఎస్ లో అన్ స్టాపబుల్ గా ‘కుబేర’.. లేటెస్ట్ వసూళ్లు!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో మన టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే “కుబేర”. ఒక ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి ధనుష్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే సినిమా వచ్చి ఇపుడు మూడో వారం లోకి ఎంటర్ అయ్యాక కూడా మంచి బుకింగ్స్ ని సినిమా నమోదు చేస్తుంది.

అయితే యూఎస్ మార్కెట్ లో ఇంకా కుబేర సాలిడ్ వసూళ్లు నమోదు చేస్తుండడం విశేషం. ఇలా అక్కడ కుబేర 2.4 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేయడం అనేది విశేషం. దీనితో అక్కడ సినిమా ఎలా రాణిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రంలో జిమ్ షర్బ్ విలన్ పాత్రలో నటించగా హీరోయిన్ రష్మిక మందన్నా మంచి పాత్ర పోషించింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version