ఫోటో మూమెంట్: ఒకే ఫ్రేమ్ లో ‘కిస్సిక్’ కాంబినేషన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ చిత్రం “పుష్ప 2” కోసం తెలిసిందే. అయితే ఈ సినిమాలో క్లిక్ అయ్యిన ఎన్నో సాలిడ్ మూమెంట్స్ తో కిస్సిక్ సాంగ్ కూడా ఒకటి. అల్లు అర్జున్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

అలా పుష్ప 2 కి కూడా క్రేజీ హీరోయిన్ శ్రీలీలతో కిస్సిక్ సాంగ్ చేయిస్తే ఇది భారీ హిట్ అయ్యింది. మరి శ్రీలీల, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ లు కలిసి కనిపించిన ఇక ఐకానిక్ పిక్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టాప్ స్టార్స్ లేటెస్ట్ గా యూఎస్ కి తానా ఉత్సవాలకు హాజరయ్యారు. అలా ముగ్గురు కలిసిన పిక్ ఇపుడు సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది.

Exit mobile version