పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ అలాగే విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” పై రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ తో గట్టి హైప్ వచ్చింది. ఇన్నాళ్లు ఎదురు చూసిన చూపులకి మేకర్స్ మంచి సమాధానం అందించారు. అయితే ఇక ట్రైలర్ తర్వాత మిగతా తతంగం జరగాల్సి ఉంది.
దీనితో సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ పై సాలిడ్ ఇన్ఫో తెలుస్తుంది. దీని ప్రకారం ఈ జూలై 19న గ్రాండ్ గా తిరుపతిలోనే మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని జరపడానికి లాక్ చేసినట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఇక్కడే అనౌన్స్ చేసి వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. కానీ ఈసారి మిస్ కాదట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ఏ ఎం రత్నం నిర్మాణం వహించారు.