మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా ఒకరు. మరి తన కెరీర్లో లవ్ స్టోరీస్ తర్వాత తీసుకున్న టర్న్ తో ఒకో సినిమా మరింత ఇంప్రెస్ చేస్తూ వచ్చింది. అలా తాను తెరకెక్కించిన చిత్రమే “లక్కీ భాస్కర్”. మళయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యి అదరగొట్టింది.
అయితే ఈ సినిమాకి అప్పుడు సీక్వెల్ ఉన్నట్టుగా సినిమాలో ఏమీ హింట్ ఇవ్వలేదు కానీ ఇపుడు డైరెక్ట్ గా దర్శకుడే లక్కీ భాస్కర్ కి సీక్వెల్ ని కన్ఫర్మ్ చేశారు. రీసెంట్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ కి పార్ట్ 2 ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఈ సినిమా లవర్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.