వెంకటేష్, రామ్ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్ బెంగుళూరుకు మారింది. ఈ సినిమా ‘బోల్ బచ్చన్’ కి రీమేక్. అంజలి మరియు షాజాన్ పదాంసి హీరోయిన్స్. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్లో రామ్ మరియు అంజలీ నడుమ చిత్రీకరించారు. స్క్రిప్ట్ ప్రకారం రామ్ , అంజలి తోడబుట్టిన వాళ్లంట, షాజాన్ పదాంసి వెంకటేష్ చెల్లెలుగా కనిపించనుంది. ఈ బెంగుళూరు షెడ్యూల్ తరువాత పూణే దగ్గర పంచగనిలో చిత్రీకరిస్తారట.
వెంకటేష్ ఈ చిత్రంలో కొత్త గెటప్ లో కనపడనున్నాడు. ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో “నాకు ఒక అలవాటు వుంది. నేను చెయ్యబోయే రీమేక్ చిత్రాలు నా పిల్లలకు, నా స్నేహితులకు చూపిస్తాను. నేను బోల్ బచ్చన్ చూపిస్తున్నప్పుడు వయస్సుతో బేధం లేకుండా అందరూ చాలా ఆనందంగా చూసారు. ఈ స్క్రిప్ట్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేసారు. ఇప్పుడు అది అద్బుతంగా వచ్చిందని ” చెప్పాడు. వెంకటేష్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు తెరకెక్కించిన కే. విజయ భాస్కర్ ఈ సినిమాకి దర్శకుడు. డి. సురేష్ బాబు మరియు స్రవంతి రవి కిషోర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.