మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో రామారావు లెంక, పద్మ లెంక కలసి నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ `బ్లాక్డ్`. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ఇటీవల విడుదలైన `బ్లాక్డ్`మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు పద్మ లెంక, రామారావు లెంక మాట్లాడుతూ… “బ్లాక్డ్ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హారర్ కామెడీ జోనర్‌లో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఆర్టిస్టులు కొత్తవారైనా బాగా చేశారు. సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సినిమాలోని అన్ని పాటలు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలోనే టీజర్, పాటలని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు..