ఆసుపత్రి పాలైన బిందు మాధవి


అవకాయ్ బిర్యాని సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆ తరువాత బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ సినిమాల తరువాత పెద్ద అవకాశాలు లేక తమిళ ఇండస్ట్రీకి వెళ్ళిపోయిన బిందు మాధవి ఇటీవల ఆసుపత్రి పాలైంది. ఆమె ఒక తమిళ సినిమా షూటింగ్ కోసం తిరుచ్చి నుండి మైసూరు వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. చేయి మణికట్టు విరగడంతో ఆమెకు ఆపరేషన్ చేసారు. ఆపరేషన్ చేసిన తరువాత ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని సమాచారం. రామ రామ కృష్ణ కృష్ణ తరువాత పిల్ల జమిందార్ మినహా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు.

Exit mobile version