వర్షాలు పడుతున్నా క్రౌడ్స్ ని రాబట్టుకుంటున్న భాయ్

వర్షాలు పడుతున్నా క్రౌడ్స్ ని రాబట్టుకుంటున్న భాయ్

Published on Oct 25, 2013 11:00 AM IST

Bhai1
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘భాయ్’ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బాక్స్ ఆఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ, భారీగా వర్షాలు పడుతున్నప్పటికీ సినిమాకి ఉన్న క్రేజ్ వల్ల థియేటర్స్ కి క్రౌడ్స్ బాగా వస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్, నాగార్జున లుక్, వీరభద్రం చౌదరి ట్రాక్ రికార్డ్ వల్ల వాతావరణం బాలేకపోయినా థియేటర్స్ కి ఎక్కువగా ఆడియన్స్ వస్తున్నారు.

ఈ మూవీ వీరభద్రం చౌదరి డైరెక్టర్. ఈ వీకెండ్ లో మూవీ మాస్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందని వీరభద్రం ఎంతో నమ్మకంగా ఉన్నాడు. అలాగే మరి కొద్ది రోజుల్లో దీపావళి పండుగ ఉండడంతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నారు.

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున ఈ సినిమాని నిర్మించాడు. రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు