రేపే నాగార్జున భాయ్ ఆడియో

రేపే నాగార్జున భాయ్ ఆడియో

Published on Oct 13, 2013 2:45 PM IST

bhai-release-date
కింగ్ అక్కినేని నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ ‘భాయ్’. ఈ మూవీ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని రేపు అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. నాగార్జున సరసన రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి వీరభద్రం చౌదరి డైరెక్టర్. ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాలో పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు