వరల్డ్ వైడ్ ‘మిరాయ్’ ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతంటే!

వరల్డ్ వైడ్ ‘మిరాయ్’ ఫస్ట్ వీక్ వసూళ్లు ఎంతంటే!

Published on Sep 19, 2025 12:01 PM IST

Mirai Movie

గత వారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యిన సాలిడ్ చిత్రాల్లో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అలాగే యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం “మిరాయ్” కూడా ఒకటి. మంచి హైప్ నడుమ వచ్చిన ఈ చిత్రం తేజ సజ్జ కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఇలా మొదటి వీకెండ్ వరకు సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఇపుడు మొదటి వారం రోజుల రన్ ని కంప్లీట్ చేసుకుంది.

మరి ఈ వారం రోజుల్లో మిరాయ్ చిత్రానికి 112.10 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో మిరాయ్ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరిచింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా రితికా నాయక్ హీరోయిన్ గా నటించింది. అలాగే మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ గా నటించగా శ్రేయ, జైరాం తదితరులు కీలక పాత్రలు చేశారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు