అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ‘భద్రమ్’ సినిమా ఈ శుక్రవారం విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పి. రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ సినిమా తెగిడికి డబ్బింగ్ వెర్షన్. గుడ్ సినిమా గ్రూప్ – బి. రామకృష్ణ రెడ్డి కలిసి తెలుగులో ఈ మూవీని మనకు అందించారు.
ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మల్టీ ప్లెక్స్ మరియు ఎ సెంటర్స్ ప్రేక్షకులు నుండి మంచి ఆదరణ లబిస్తోంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగున్నాయి. బాక్స్ ఆఫీసు వద్ద ఇదే విధమైన రన్ మరి కొద్ది రోజులు ఉంటుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఇటీవలే హైదరాబాద్ థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్ర టీం ఈ వారాంతం లోపు వైజాగ్, విజయవాడలలో ప్రేక్షకులను కలవనున్నారు.
గతంలోలాగానే గుడ్ సినిమాస్ సంస్థ వారు ఈ సినిమాని ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా భారీగా చేసారు. డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించాడు.