కొత్త నటీనటులతో మారుతి డైరెక్షన్లో రూపొందిన ‘బస్ స్టాప్’ విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా ఈ చిత్ర టీం సభ్యులు విలేఖరులతో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ఆ నాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి 8 నెలల్లో ముఖ్యమంత్రిగా అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఈ నాడు మా మారుతి 8 నెలల్లో బస్ స్టాప్ సినిమా తీసి భారీ హిట్ కొట్టాడు. ఒకే సంవత్సరంలో రెండు హిట్లు ఇవ్వడం అనేది ఈ రోజు చాల అరుదు. దర్శకుడు మారుతి తన మొదటి సినిమా ‘ఈ రోజుల్లో హిట్ కొట్టి చూపించి మళ్లీ ఇప్పుడు బస్ స్టాప్ సినిమాతో రెండు వరుస హిట్లు కొట్టి చూపించాడు. ఈ సినిమాలో బూతు ఉందని కొందరు అంటున్నారు. అలంటి వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ సినిమాలో బూతులు ఉన్నాయని అంటే వాళ్ళకి ఈ సినిమా వేసి చూపిస్తాను. బూతులు ఎక్కడున్నాయో చూపించొచ్చు. ఈ సినిమాని తమిళ, కన్నడ భాషల్లో కూడా నిర్మిస్తాను. తమిళ్ సినిమాకి కూడా మారుతినే డైరెక్ట్ చేస్తాడు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు, టీం సభ్యులందరికీ కృతజ్ఞతలు”. బస్ స్టాప్ సినిమాని శ్రీ లక్ష్మి నరసింహా ప్రొడక్షన్స్, మల్టీ డైమన్షన్ ఎంటర్టైన్మెంట్ పైవేట్ లిమిటెడ్ సంస్థలు కలిపి నిర్మించాయి.
బెల్లంకొండ ఓపెన్ ఛాలెంజ్
బెల్లంకొండ ఓపెన్ ఛాలెంజ్
Published on Nov 19, 2012 4:30 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- యూత్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించేలా ‘K-ర్యాంప్’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’