‘బలుపు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

‘బలుపు’ కొత్త షెడ్యూల్ ప్రారంభం

Published on Feb 21, 2013 11:25 PM IST

Balupu

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న ‘బలుపు’ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హసన్, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పి.వి.పి సినిమా బ్యానర్ ఫై ప్రసాద్ వి.పోట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గోపీచంద్ మలినేని వివాహం సంధర్భంగా నిలిచిపోయింది. చాలా రోజుల తరువాత మళ్లి ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో కొన్ని ముఖ్యమైన సీన్స్ ని రవితేజ,శృతి హసన్ లఫై షూట్ చేయనున్నారు. ‘బలుపు సినిమా తిరిగి ప్రారంభం’ అని శృతి హసన్ తన ట్విట్టర్ లో ట్విట్ చేసింది. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ తరువాత విడుదలయ్యె అవకాశం ఉంది.

తాజా వార్తలు