నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలు ఈ మధ్య ఒన్లీ యాక్షన్ అన్నట్లు ఉంటున్నాయి గాని, గతంలో బాలయ్య చాల వైవిధ్యమైన సినిమాలను చేశారు. మళ్ళీ బాలయ్య అలాంటి సినిమాలను చేయబోతున్నాడు. కథల విషయంలో.. తానూ చేసే యాక్షన్ విషయంలో బాలయ్యలో మార్పు వచ్చిందని, ఇక నుండి బాలయ్య అన్ని వర్గాల ప్రేక్షుకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇక పై తను చేయబోయే చిత్రాల్లో కొత్తదనం ఖచ్చితంగా ఉండాలని బాలయ్య దర్శకులకు క్లారిటీగా చెప్పారట.
తనకు కథ చెప్పాలనుకుంటే కొత్తదనం ఉండాలని, అప్పుడే కథ చెప్పడానికి రండని తనకు టచ్ లో ఉన్న డైరెక్టర్స్ కి బాలయ్య క్లారిటీ ఇచ్చారట. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ‘సింహ, లెజెండ్’ చిత్రాల మాదిరిగా మాస్ అండ్ యాంగ్రీ హీరోగానే కాకుండా ఇంకాస్త కొత్తగా కనిపించాలని బాలయ్య గుండు లుక్ లో కనిపించబోతున్నారు. మరి బాలయ్య కొత్తదనం ఎలా ఉంటుందో.. అందర్నీ బాలయ్య ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.