పక్కా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణల కాంబో అంటే మన తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. మరి అలా ఇప్పటికే వచ్చిన “సింహా” మరియు “లెజెండ్” చిత్రాలు భారీ హిట్స్ గా నిలిచాయి. అలా ఇప్పుడు వీరి కాంబో నుంచి మరో హ్యాట్రిక్ చిత్రం వస్తుండడంతో దానిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే టీజర్ తో ఆ అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇక అలాగే మేకర్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేసారు. కానీ అసలైన విషయాన్ని మాత్రం ఇంకా దాచే ఉంచారు. అదే ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది. మరి దీనికి గట్టి కారణమే ఉన్నట్టు అనుకోవాలి. వీరి కాంబో అనగానే ఎక్కడ లేని అంచనాలు సెట్టయ్యాయి.
మరి అందుకు తగ్గట్టుగా ఇంతకు ముందు తీసిన రెండు సినిమాలు “సింహా”, “లెజెండ్” సినిమాల టైటిల్స్ ను తలదన్నే రేంజ్ లో ఈసారి టైటిల్ ఉండాలని ఇంకా ఏ టైటిల్ ను కన్ఫర్మ్ చెయ్యలేదేమో అనుకోవచ్చు. మరి ఈసారి ఈ సెన్సేషనల్ కాంబో ఎలాంటి టైటిల్ తో వస్తుందో చూడాలి.