నందమూరి నటసింహం బాలకృష్ణ ఇపుడు ఎలాంటి ఫామ్ లో ఉన్నారో అందరికీ తెలిసిందే. ఒకదాన్ని మించిన ఒకటి హిట్ వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న బాలయ్య ఇపుడు నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రమే “అఖండ 2 తాండవం”. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన మొదటి సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
ఇక దీనితో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది. బాలయ్యపై ఇపుడు పలు సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ లు మేకర్స్ తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ గా థమన్ అయితే అఖండ 2 కి హై మామూలుగా ఉండదు అని ప్రామిస్ చేస్తున్నాడు.
అయితే అఖండ 1 కి థమన్ ఇచ్చిన స్కోర్ సగానికి పైగా సినిమాకి ప్లస్ గా నిలిచింది. ఇక పార్ట్ 2 కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుంది అని బాలయ్య ఫ్యాన్స్ చెబుతుంటే వారికి ఇది హై అంటే అన్నట్టు సింహం ఎమోజి పెట్టి మరీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నాడు. ఇక పార్ట్ 2కి తన ఇచ్చే స్కోర్ కోసం చాలా మంది మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు.
This is HIGH !!
????⚡️⚡️⚡️⚡️⚡️⚡️ https://t.co/VFBYZW4jhH
— thaman S (@MusicThaman) March 13, 2025