మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య !

మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలయ్య !

Published on Aug 23, 2020 10:05 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణకు మనసు మంచిదని.. అలాగే ఆయనలో సేవాగుణం కూడా ఎక్కువేనని, ఆపదలో ఉంటే అడగకుండానే సాయం చేస్తారని ఆయనను దగ్గరిగా చూసినవాళ్ళు చెబుతుంటారు. అలాగే బాలయ్య బాబు మరోసారి త‌న ఉదార స్వ‌భావాన్ని చూపించారు. హిందూపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలోని కోవిడ్ కేంద్రానికి 55 లక్షల విలువైన మెడిషన్స్ ను, పిపిఇ కిట్లును, అలాగే మాస్క్ లు మరియు ఇతర సామగ్రిని విరాళంగా ఇస్తున్నారు.

ఇప్పటికే బాలయ్య కరోనా నివారణ కోసం కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం ఏకంగా 1.25 కోట్ల సాయం చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలోని దాదాపు 12 వేలమందికి ఆయన మెడిషన్స్ ను అండ్ ఇతర సామగ్రిని కూడా అందజేశారు. ఇక ఎప్పటి నుండో బాలయ్య బాబు తన బసవతారకం ఛారిటబుల్ ట్రస్ట్‌ నుండి పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యం చేయిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య కొన్ని సీక్వెన్స్ లో అఘోరాగా కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

తాజా వార్తలు