శ్రీ రామన్నారాయణ షూటింగ్లో పాల్గొంటున్న బాలకృష్ణ


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘శ్రీ రామన్నారాయణ’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఇటీవల ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ క్లైమాక్స్ సన్నివేశాల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం శ్రీ రామన్నారాయణ హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతుంది. రవి చావాలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నాడు. బాలకృష్ణ సరసన ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

Exit mobile version