బాలయ్య కూడ అదే ఆలోచనలో ఉన్నారా ?

బాలయ్య కూడ అదే ఆలోచనలో ఉన్నారా ?

Published on Jan 30, 2021 3:00 AM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కలయికలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య, బోయపాటిల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. చిత్రీకరణ దశలో ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇటీవలే చిత్రీకరణ తిరిగి మొదలైంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించగా బాలయ్య కూడ రిలీజ్ మీద దృష్టి పెట్టారు.

ఫిల్మ్ నగర్ టాక్ మేరకు ఈ చిత్రాన్ని మే నెలలో రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే మే నెలలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ విడుదలకానుంది. ప్రభాస్ యొక్క ‘రాధేశ్యామ్’ కూడ ఇదే నెలలో విడుదలకావచ్చు. వీటి మధ్యలో బాలకృష్ణ, బోయపాటిల సినిమా కూడ వస్తే బాక్సాఫీస్ వద్ద పోటీ రసవత్తరంగా ఉంటుంది. పెద్ద సినిమాలు పోటీ చూసి చాలా నెలలే అవుతోంది కాబట్టి సినీ ప్రేక్షకులు కూడ ఎంజాయ్ చేస్తారు. మరి చూడాలి బాలయ్య మే నెలలోనే దిగుతారో లేకపోతే ఇంకేదైనా డేట్ చూసుకుంటారో. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, పూర్ణ నటిస్తున్నారు. మరొక ప్రముఖ నటుడు శ్రీకాంత్ ఇందులో నెగెటివ్ రోల్ చేస్తున్నారు. సినిమా టైటిల్ ఏమిటనేది ఇంకా రివీల్ చేయలేదు టీమ్. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు