వరుసబెట్టి కెమెరామెన్లను మారుస్తున్న బాద్షా దర్శకుడు!

వరుసబెట్టి కెమెరామెన్లను మారుస్తున్న బాద్షా దర్శకుడు!

Published on Oct 2, 2012 2:30 PM IST


శ్రీను వైట్ల తీస్తున్న ‘బాద్షా’ సినిమా కోసం మళ్లీ కెమెరామన్ ని మార్చాడు. ఇప్పటికే ముగ్గురు కెమెరామెన్లను మారిన ఈ సినిమాకి ఇప్పుడు నాలుగో కెమెరామెన్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. మొదట ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినపుడు డార్లింగ్, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన ఆండ్రూని తీసుకున్నారు. ఏమైంది ఏమో తెలియదు కాని ఆండ్రూ స్థానంలో జయనన్ విన్సెంట్ ని తీసుకున్నారు. ఆ తరువాత జయనన్ విన్సెంట్ ని కూడా కాదని ఆర్.డి రాజశేఖర్ ని తీసుకున్నారు. ఇప్పుడు ఆర్.డి రాజశేఖర్ స్థానంలోకి కె.వి గుహన్ వచ్చాడు. శ్రీను వైట్ల చివరి సినిమా దూకుడుకి ఇలాగే కెమెరామెన్లను మార్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి కూడా అలాంటి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడేమో అని ఫిలిం నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు

తాజా వార్తలు